- వాళ్లిద్దరిని వదల
- టార్గెట్ హరీశ్, జగదీశ్ రెడ్డిగా కామెంట్స్
- నేతలకు కవిత మరోసారి హెచ్చరికలు
హైదరాబాద్, మహా: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆమె పర్యటనలో భాగంగా మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ఓటమికి దారితీసిన పలు అంతర్గత కారణాలపై దృష్టి సారించారు. కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేశాయి. అధికారంలో ఉన్నప్పుడు వారికి అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించడంలో వారు విఫలమయ్యారని కవిత ఆరోపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో కొందరు నాయకులు అనుసరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “వాళ్లిద్దరిని వదల” అంటూ కవిత నేరుగా హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌లో నెలకొన్న సంక్షోభం, నాయకుల పరస్పర విమర్శలు పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేస్తున్నాయి. ఈ వ్యవహారంపై వారు ఎలా స్పందిస్తారని హాట్ టాపిక్‌గా మారింది.








