- నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి
- శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రేవంత్
హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పర్యటన నిమిత్తం పుట్టపర్తి చేరుకోనున్నారు. రాష్ట్రంలో పాలనాపరమైన కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించనున్న కీలక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ప్రాంగణంలో గల సాయి కుల్వంత్ హాల్‌లో నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల వేడుకల్లో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి విచ్చేసిన సాయి భక్తులు, ప్రముఖులు, ఉన్నత అధికారులు పాల్గొననున్నారు.
Post Views: 21






