- ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
- అప్పుల బాధతో సూపైడ్.. అంబర్‌పేటలో తీవ్ర విషాదం
హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక భార్య, భర్త, పదేళ్ల కుమార్తె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండ్రోజుల క్రితమే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే ఈ కుటుంబం రామ్‌నగర్ నుంచి అంబర్‌పేటకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే పెద్ద కుమార్తె మరణించడం, మరోవైపు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 34






