హైదరాబాద్, మహా
తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలపై ఓ నెటిజన్ చేసిన పోస్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. “అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటు వేశాను, కానీ మీరు ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి” అని కోరిన నెటిజన్‌కు.. “మీరు ఓటు వేసింది కాంగ్రెస్ పార్టీకి అయినప్పుడు, ఈ ప్రశ్నకు సమాధానం కూడా వాళ్లనే అడగాలి కదా?” అంటూ కేటీఆర్ బదులిచ్చారు. పటాన్‌చెరు నుంచి డీఎల్ఎఫ్ వరకు నడిచే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీని రూ. 30 నుంచి రూ. 45కు పెంచారని, ఇది తమ లాంటి రోజువారీ ప్రయాణికులకు భారంగా మారిందని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ కోరాడు.
Post Views: 21






