@రూ. 3,2 కోట్లు..
- రూ.1.30 కోట్లు పలికిన తెలుగమ్మాయి శ్రీ చరణి
- డబ్ల్యూపీఎల్ వేలంలో భారత క్రికెటర్ల హవా
- అమీలియా కెర్‌ను 3 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
ఇంటర్నెట్ డెస్క్, మహా: డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో టీమిండియా ప్లేయర్లు సత్తాచాటారు. 23 మంది విదేశీ క్రికెటర్లతో కలిపి మొత్తం 67 మంది ప్లేయర్లని ఫ్రాంఛైజీలు తీసుకున్నాయి. అన్ని టీమ్‌లు కలిసి రూ.40.8 కోట్లు ఖర్చు చేశాయి. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అత్యధిక ధర పలికారు. ఆమెను 3.20 కోట్లతో యూపీ వారియర్స్ ఆర్‌టీఎం కార్డు ఉపయోగించి తీసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ను రూ.3 కోట్లకు ముంబయి ఇండియన్స్, భారత ఆల్‌రౌండర్ శిఖా పాండేను రూ.2.40 కోట్లకు యూపీ వారియర్స్, కివీస్ సీనియర్ ప్లేయర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ తీసుకున్నాయి. ఈ మెగా వేలంలో ఏ జట్టు ఎవరిని? ఎంతకు తీసుకుందో ఓ లుక్కేద్దాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, శ్రేయంక పాటిల్ రిటైన్ అయ్యారు. జార్జియా వోల్ (రూ.60 లక్షలు), నాడిన్ డి క్లెర్క్ (రూ.65 లక్షలు), రాధా యాదవ్ (రూ.65 లక్షలు), లారెన్ బెల్ (రూ.90 లక్షలు), లిన్సే స్మిత్ (రూ.30 లక్షలు), ప్రేమ రావత్ (రూ.20 లక్షలు.. ఆర్‌టీఎం), అరుంధతీ రెడ్డి (రూ.75 లక్షలు), పూజా వస్త్రాకర్ (రూ.85 లక్షలు), గ్రేస్ హారిస్ (రూ.75 లక్షలు), గౌతమి నాయక్ (రూ.10 లక్షలు), ప్రత్యూష కుమార్ (రూ.10 లక్షలు), దయాళన్ హేమలత (రూ.30 లక్షలు).
ముంబయి ఇండియన్స్..
అమన్‌జోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, జి కమలిని రిటైన్ అయ్యారు. అమేలియా కెర్ (రూ.3 కోట్లు), షబ్నమ్ ఇస్మాయిల్ (రూ.60 లక్షలు), సంస్కృతి గుప్తా (రూ.20 లక్షలు), సజీవన్ సజన (రూ. 75 లక్షలు), రహీలా(రూ.10 లక్షలు), నికోలా కారి (రూ.30 లక్షలు), త్రివేణి వశిష్ట (రూ.20 లక్షలు), నల్లా రెడ్డి (రూ.10 లక్షలు), సైకా ఇషాక్ (రూ.30 లక్షలు), మిలీ ఇల్లింగ్‌వర్త్ (రూ. 10 లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్..
జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, మారిజెన్ కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నిక్కీ ప్రసాద్ రిటైన్ అయ్యారు. లారా వోల్వార్ట్ (రూ.1.10 కోట్లు), చినెల్లే హెన్రీ (రూ.1.30 కోట్లు), శ్రీ చరణి (రూ.1.30 కోట్లు), స్నేహ్ రాణా (రూ.50 లక్షలు), లిజెల్ లీ (రూ.30 లక్షలు), దీయా యాదవ్ (రూ.10 లక్షలు), తనియా భాటియా (రూ.30 లక్షలు), మమత మడివాలా (రూ.10 లక్షలు), నందినీ శర్మ (రూ.10 లక్షలు), హామిల్టన్ (రూ.10 లక్షలు), మిన్ను మణి (రూ.40 లక్షలు).
యూపీ వారియర్స్..
శ్వేతా సెహ్రావత్ రిటైన్ అయింది. దీప్తి శర్మ (రూ.3.2 కోట్లు ఆర్‌టీఎం), సోఫీ ఎకిల్‌స్టోన్ (రూ.85 లక్షలు), మెగ్ లానింగ్ (రూ.1.90 కోట్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రూ.1.20 కోట్లు), కిరణ్ నవ్‌గిరే (రూ.60 లక్షలు), హర్లీన్ డియోల్ (రూ. 50 లక్షలు), క్రాంతి గౌడ్ (₹ 50 లక్షలు ఆర్‌టీఎం), ఆశా శోభన (రూ.1.10 కోట్లు), డియాండ్రా డాటిన్ రూ.80 లక్షలు), శిఖా పాండే (రూ.2.40 కోట్లు), సిమ్రాన్ షేక్ (రూ.10 లక్షలు), షిప్రా గిరి (రూ.10 లక్షలు), క్లో ట్రయాన్ (రూ.30 లక్షలు), సుమన్ మీనా (రూ.10 లక్షలు), గొంగడి త్రిష (రూ.10 లక్షలు), ప్రతీకా రావల్ (రూ.40 లక్షలు), తారా నోరిస్ (రూ.10 లక్షలు).
గుజరాత్ జెయింట్స్..
ఆష్లీగ్ గార్డ్‌నర్, బెత్ మూనీ రిటైన్ అయ్యారు. సోఫీ డివైన్ (రూ.2 కోట్లు), రేణుకా సింగ్ (రూ.60 లక్షలు), భారతి ఫుల్మాలి (రూ.70 లక్షలు), టిటాస్ సాధు (రూ.30 లక్షలు), కష్వీ గౌతమ్ (రూ.75 లక్షలు ఆర్‌టీఎం), కనికా అహుజా (రూ.30 లక్షలు), తనుజా కన్వర్ (రూ. 45 లక్షలు), జార్జియా వేర్‌హమ్ (రూ.కోటి), అనుష్క శర్మ (రూ.45 లక్షలు), హ్యాపీ కుమారి (రూ.10 లక్షలు), కిమ్ గార్త్ (రూ.50 లక్షలు), యాస్తికా భాటియా (రూ.50 లక్షలు), డాని వ్యాట్ హాడ్జ్ (రూ.50 లక్షలు), ఆయుషి సోనీ (రూ.30 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్ (రూ.40 లక్షలు), శివాని సింగ్ (రూ.10 లక్షలు).








