Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ..

Share

పటాన్ చేరు మహా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పటాన్ చేరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు.అభ్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవత మూర్తుల ఉత్సవ విగ్రహాలతో ప్రాంగణం మొత్తం శోభాయమానంగా తీర్చిదిద్దారు.శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వచ్చిన ప్రత్యేక పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్విరామంగా కొనసాగాయి.ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ముందుగా శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం నిర్వహించారు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వాముల పెటతుల్లి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు.సుమారు 10 వేల మంది భక్తులు కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పట్టభద్రుల శాసన మండలి సభ్యులు అంజి రెడ్డి, దుబ్బాక శాసన సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, గూడెం కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Latest