Mahaa Daily Exclusive

  మెడికల్ హెల్త్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జుకూరి చైతన్య రాజువర్మ…

Share

  • నియామక పత్రం అందజేసిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
  • రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి సారిస్తాం:చైతన్య రాజువర్మ

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

మెడికల్ హెల్త్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఆర్గనైజేషన్ ఇంచార్జిగా జుకూరి చైతన్య రాజువర్మ బాధ్యతలు చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్స్ సెల్ మెడికల్ హెల్త్ విభాగంలో కీలక నియామకాలు చేపట్టడం జరిగింది. గాంధీ భవన్‌లో శుక్రవారం డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డా ఎం రాజీవ్, పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, చేతులు మీదుగా, డాక్టర్స్ సెల్ విభాగంలో వర్మ మెడికల్ హెల్త్ విభాగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజింగ్ ఇంచార్జ్‌గా నియమితులైన జుకూరి చైతన్య రాజుకు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డా ఎం రాజీవ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత శక్తివంతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడానికి చైతన్య రాజు వర్మ సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందించే సేవలలో మెడికల్ హెల్త్ విభాగం అత్యంత కీలకమని, రాష్ట్రవ్యాప్త ఆరోగ్య కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర వహిస్తారని అన్నారు. ఈ బాధ్యత స్వీకరించిన సందర్భంలో జుకూరి చైతన్య రాజువర్మ మాట్లాడుతూ… పార్టీ బలోపేతం కోసం, ముఖ్యంగా మెడికల్, హెల్త్ విభాగాన్ని సుశక్తిపరచడానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ప్రతి ఇంటికి ఆరోగ్య అవగాహన చేరవేయడం తన ముఖ్య ధ్యేయమని తెలిపారు. వైద్య శిబిరాలు, ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజా సేవలకు తాను నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎఐసిసి ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు, పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, మెడికల్ హెల్త్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ కు తదితరులకు తన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Latest