- పేదల కోసం
- అర్ధరాత్రి వరకూ కోర్టులో ఉంటా
- లగ్జరీ వ్యాజ్యాలు ఉండవు.. అవి సంపన్నులు వేస్తున్నారు
- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ, మహా: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేద కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడటం తన తొలి ప్రాధాన్యమన్న ఆయన.. అవసరమైతే, వారి కోసం అర్ధరాత్రి వరకూ న్యాయస్థానంలో కూర్చుంటానని అన్నారు. తిలక్ సింగ్ డాంగి అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతరులపై దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన సందర్భంగా సీజేఐ ఈ విధంగా స్పందించారు. తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలు ఉండవని, ఇటువంటి కేసులను సంపన్నులు వేస్తున్నారని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. హరియాణా హిసార్ జిల్లాలోని మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్ సూర్యకాంత్.. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 15 నెలలపాటు ఈ పదవిలో ఉండనున్నారు. 2027 ఫిబ్రవరి 9న సీజేఐ పదవీ విరమణ చేస్తారు.
Post Views: 24







