Mahaa Daily Exclusive

  కాళోజీ అక్రమాలపై సీఎం సీరియస్..! సీఎం ఆగ్రహంతో వైస్ ఛాన్స్ లర్ రాజీనామా..!

Share

  • కాళోజీ అక్రమాలపై సీఎం సీరియస్
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • సీఎం ఆగ్రహంతో వైస్ ఛాన్స్ లర్ రాజీనామా

 

హైదరాబాద్, మహా : కాళోజీ యూని వర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్‌చార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై సీఎం ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని సీఎం సూచించారు. కాగా, వైద్య విద్య పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు, సీట్ల కేటాయింపు వరకు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

 

వైస్ ఛాన్స్ లర్ రాజీనామా

కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నందకుమార్ రాజీనామా చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకవతకలతో పాటు ఇన్‌చార్జీల నియామకంలో ఆరోపణలు రావడంతో శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేశారు.

Latest