Mahaa Daily Exclusive

  ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు..

Share

  • ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు
  • గురువులను సత్కరించుకున్న విద్యార్థులు
  • నాటి స్నేహితుల ఆప్యాయ పలకరింపులు

రంగారెడ్డి జిల్లా మహా:
మేడిపల్లి నక్కర్త జడ్పిహెచ్ఎస్ 1999- 2000 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల (సిల్వర్ జూబిలీ 25 ఇయర్స్) ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. యాచారం మండలం, మేడిపల్లి నక్కర్త గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999- 2000 చదివిన పదవ తరగతికి చెందిన విద్యార్థులు విద్యార్థినిలు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపములో ట్రీ టాప్ రిసార్ట్ లో… వారు పదవ తరగతి పూర్తిచేసుకుని 25 సంవత్సరాలు పూర్తియిచేసుకున్న సందర్బంగా సిల్వర్ జూబిలీ 25 సంవత్సరాల వేడుకను నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులు మొదటగా జ్యోతి ప్రజ్వల వెలిగించి వీరికి విద్యను బోధించిన గురువులను సత్కరించుకుని, మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని వారి వారి తీపి జ్ఞాపకాలను మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. వినోదాత్మకమైన ఆట పాటలతో ఆనదంగా గడిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తమ మిత్రులలో ఎవరికైనా ఏ ఆపద వచ్చిన తామందరం అండగా ఉంటామని ఈ స్నేహ బంధం ఎల్లప్పుడూ ఇలాగే కలిసి మెలసి కొనసాగాలని, మునుముందు ఇలాంటి గెట్ టు గెథెర్ ప్రొగ్రాములో ఇంకెన్నో జరుపుకోవాలని వారి ఆకాంక్షను తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడము జరిగింది. ఈ కార్యక్రమములో గురువులు, మేడిపల్లి నక్కర్త జడ్పిహెచ్ఎస్ 1999- 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Latest