రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రహ్మయ్య శనివారం సాయంత్రం హఠాత్ మరణం చెందాడు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సిపిఎం నాయకులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఆదివారం యాచారంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, బ్రహ్మయ్య హఠాత్ మరణం తీవ్రంగా కలచివేసిందని ఆయన పార్టీ కోసం చేసిన సేవలను కొనియాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొనసాగిన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో కలిసి సిపిఎం జిల్లా నాయకులు పగడాల యాదయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 23







