ఢిల్లీ, మహా: ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో ఏడు రోజులు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్‌లో తనిఖీ చేసుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ రెండో దశలో ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి.
డిసెంబర్ 4 నుంచి 11వ తేదీకి మార్పు..
కొత్తగా ప్రకటించిన మార్పుల ప్రకారం ఎన్యూమరేషన్ ప్రక్రియ గడవు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11వ తేదీకి మారింది. ఇక రేషనలైజేషన్, రీ ఆరేంజ్‌మెంట్ ఆఫ్ పోలింగ్‌స్టేషన్స్ గడువు డిసెంబర్ 11గా ఉంది. ఇక కంట్రోల్ టేబుల్ అప్‌డేషన్, డ్రాఫ్ట్ రోల్‌ను సిద్ధం చేసే ప్రక్రియ డిసెంబర్ 12-15 వరకు జరగనుంది. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ డిసెంబర్ 16వ తేదీన జరగనుంది. ఇక క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రకటనకు డిసెంబర్ 16- 2026 జనవరి 15వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఇక నోటీస్ ఫేజ్‌ను డిసెంబర్ 16 నుంచి 2026 ఫిబ్రవరి 7గా నిర్ణయించింది.
========================







