Mahaa Daily Exclusive

  చికిత్స పొందుతూ రైతు మృతి

Share

నేలకొండపల్లి, నవంబర్ 30 మహా:

అప్పులు బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్యాయత్నం కు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని శంకరగిరితండా గ్రామానికి చెందిన బాణోత్ వీరన్న (27) అనే కౌలు రైతు వ్యవసాయం లో నష్టాలు ‘ అధిగమించలేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డాడు. ఖమ్మం లోని ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడు తల్లి బోడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ హస్పిటల్ మృతదేహం కు పోస్టుమార్టమ్ నిర్వహించారు.

Latest