మహా
ప్రపంచంలోని మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సాటిలేని రారాజుగా నిలిచాడు. రాంచీ వన్డేలో సూపర్ శతకంతో రెచ్చిపోయిన విరాట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ‘ఆల్‌టైమ్ రికార్డు’ను బ్రేక్ చేశాడు. ఇదివరకూ వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సెంచరీలను దాటేసిన కింగ్ కోహ్లీ.. ఈసారి ఒక ఫార్మాట్లో అత్యధిక శతకాలతో సచిన్ రికార్డును బద్ధలుకొట్టాడు. రాంచీలో దక్షిణాఫ్రికా బౌలర్లపై ఊచకోతకు దిగిన అతడు వింటేజ్ కోహ్లీని తలపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు డకౌట్ల తర్వాత ఆఖరి వన్డేలో అజేయ అర్ధ శతకం బాదిన విరాట్.. ఇప్పుడు స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో శతకంతో కదంతొక్కాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో సచిన్ 51 శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే.. కోహ్లీ వన్డేల్లో 52వ సారి మూడంకెల స్కోర్ అందుకొని అంతర్జాతీయ క్రికెట్ ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం విరాట్ అన్ని ఫార్మాట్లలో కలిపి 83 సెంచరీలు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 7 వేల శతకం కోహ్లీ సాధించడం విశేషం. సచిన్ 100 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సార్లు మూడంకెల్ స్కోర్ నమోదు చేశాడు.







