Mahaa Daily Exclusive

  నాబార్డ్ అధికారులచే ఉప్పరిగూడ సొసైటీ బ్యాంకు సందర్శన: సేవలపై హర్షం

Share

  • ఉప్పరిగూడ సొసైటీ బ్యాంకును సందర్శించిన నాబార్డ్ అధికారులు
  • సొసైటీ అందిస్తున్న సేవలకు హర్షం వ్యక్తం చేశారు

రంగారెడ్డి జిల్లా మహా:

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని సందర్శించిన నాబార్డ్ అధికారులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని, సంఘం చైర్మన్ ఏదుళ్ళ పాండురంగారెడ్డి సమక్షంలో, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ కే సూదు, ఎండి టీఎస్ క్యాబ్ వై కే రావు, జయం ప్రభాకర్ రెడ్డి, పని శ్రీరామ్, డీజీఎం కిరణ్ కుమార్, సొసైటీ బ్యాంకును సీఈవో గణేష్ లతో కలిసి సందర్శించి, బ్యాంకు యొక్క పనితీరును లావాదేవీల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. సంఘం చైర్మన్ పాండురంగారెడ్డి, బ్యాంకు యొక్క పనితీరును లావాదేవీల గురించి, సొసైటీ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను నాబార్డ్ అధికారులకు వివరించారు. ఉప్పరిగూడ సొసైటీ ద్వారా, చైర్మన్ పాండురంగారెడ్డి రైతులకు అందిస్తున్న సేవలను నాబార్డ్ అధికారులకు కొనియాడారు. బ్యాంకు పనితీరు లావాదేవీల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.