- విద్యార్థి నేత నుంచి కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా..
- నేడు డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న మేడిపల్లి..
- హాజరుకానున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం , అడ్లూరి
కరీంనగర్, మహా
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎగిసిన కెరటం.. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సంఘం నేతగా కీలకపాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లిన వారిలో ఆయన ఒకరు. ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లో ప్రవేశించారు. అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన ఏకైక విద్యార్థి నాయకుడు. చొప్పదండి ప్రజల విశ్వాసాన్ని చురగొన్నారు. తన జీవిత లక్ష్యాన్ని సాధించారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విద్యార్థి స్థాయి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై..డిసిసి అధ్యక్ష పదవినీ అధిరోహించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఇటీవల నియమితులయ్యారు. ఎమ్మెల్యేగా చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు. విద్య వైద్య రంగంలో ముందు ఉంచుతున్నారు. చొప్పదండినీ ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చే దిశగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. ఆయనే చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ నూతన డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం.. డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన మేడిపల్లి సత్యం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో శుక్రవారం నాలుగు గంటలకు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హాజరవుతున్నారు. వారి సమక్షంలో మేడిపల్లి సత్యం డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.








