Mahaa Daily Exclusive

  భర్త ఎమ్మెల్యే… సర్పంచ్ బరిలో దిగిన భార్య…

Share

  • భర్త ఎమ్మెల్యే
  • సర్పంచ్ బరిలో దిగిన భార్య
  • నామినేషన్ దాఖలు చేసిన నజ్మాహెప్తుల్లా
  • రెండు సార్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా చేసిన ప్రజా ప్రతినిధి

మెదక్, మహా : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో తాజాగా ఆసక్తికర సన్నివేశం కనిపించింది. కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భార్య సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. భార్య నజ్మా సుల్తానా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. భర్త సర్పంచ్ గా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తుంటే భార్య గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఎన్నికల బరిలో దిగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాదు ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా కూడా మారింది. ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ స్వస్థలం మెదక్‌ జిల్లాలోని వెల్దుర్తి మండలంలో ఉన్న బస్వాపూర్‌ గ్రామం. సొంత ఊరిలో కొత్తగా ఇల్లు కట్టడంతో ఎమ్మెల్యే భార్య నజ్మా సుల్తానా గత కొన్నాళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె సర్పంచ్ బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరిచారు. ఈక్రమంలో గురువారం ఆమె బస్వాపూర్‌ సర్పంచి అభ్యర్థిగా తన నామినేషన్‌ సమర్పించారు. ఇదిలా ఉంటే నజ్మా గతంలో హైదరాబాద్‌లో.. నానల్ నగర్, గోల్కొండ ప్రాంతాల నుంచి 2 సార్లు కార్పొరేటర్‌గా వ్యవహరించారు. ఇక స్వయంగా ఎమ్మెల్యే భార్య సర్పంచ్ బరిలో నిలవడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. మరి నజ్మా ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా.. లేదా బరిలో తలపడతారా అనేది త్వరలోనే తేలనుంది.