Mahaa Daily Exclusive

  హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్ట్ నోటీసులు…

Share

  • హిల్ట్ పాలసీపై
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్ట్ నోటీసులు
  • రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
  • విచారణ 29 కి వాయిదా

హైదరాబాద్, మహా : హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(హిల్ట్) పాలసీపై విచారించిన హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. వెంటనే సమాధానాలు ఫైల్ చేయాలని పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. హిల్ట్ పాలసీపై సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు చేయించాలని కేఏ పాల్ తన పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది.