Mahaa Daily Exclusive

  పోలీస్ దొంగ… స్టేషన్ లాకర్ లో నుంచి ఫోన్ చోరీ చేసిన కానిస్టేబుల్…

Share

  • పోలీస్ దొంగ
  • స్టేషన్ లాకర్ లో నుంచి ఫోన్ చోరీ చేసిన కానిస్టేబుల్
  • సొత్తు రికవరీ … రిమాండ్ కు తరలింపు

హైదరాబాద్, మహా : రికవరీ సొత్తును పోలీసుస్టేషన్ లోని లాకర్ నుంచి చోరీ చేశాడు ఒక పోలీసు డ్రైవర్. ఈ సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మెహిదీపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మెహిదీపట్నం పోలీసుస్టేషన్ పరిదిలో కొద్ది రోజుల క్రితం ఒక ప్రయాణికుడు ఫోన్ ను పోగొట్టుకున్నాడు. సదరు వ్యక్తి స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దొంగను పట్టుకున్న పోలీసులు దాదాపు లక్షా 75 వేల రూపాయల విలువ చేసే ఫోన్ ను రికవరీ చేసి దొంగను రిమాండ్ కు తరలించారు. రికవరీ చేసిన ఫోన్ ను స్టేషన్ లోని లాకర్ లో దాచిపెట్టారు. దొరికింది రూ.1.75 లక్షల ఫోన్ కావడంతో దానిపై కన్నేసిన స్టేషన్ డ్రైవర్ గా పని చేస్తున్న శ్రవణ్ కుమార్ లాకర్ లో నుంచి ఫోన్ ను చోరీ చేశాడు. శ్రవణ్ కుమార్ దొంగతనం చేసాడని నిర్ధారించిన పోలీసులు ఫోన్ ను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.