Mahaa Daily Exclusive

  డిసెంబర్ 9 నుంచి ‘టీటీఏ సేవాడేస్ 2025’ ప్రారంభం

Share

డిసెంబర్ 9 నుంచి ‘టీటీఏ సేవాడేస్ 2025’ ప్రారంభం

▪ TTA సేవాడేస్ 2025: డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో భారీ సేవా కార్యక్రమాలు
▪ అమెరికా TTA నుండి తెలంగాణకు పెద్దసేవ—డిసెంబర్ 25న 10వ వార్షికోత్సవం
▪ భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలు

హైదరాబాద్: తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో నిలబెడుతున్న ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం’ (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహించి, అనంతరం డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు.
TTA అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటి. 2014లో స్థాపించబడిన ఈ సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో రెండువైపులా వేలాది మందికి సేవలు అందిస్తోంది.

TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను స్థానిక సమన్వయకర్తలు, వాలంటీర్ల భాగస్వామ్యంతో విజయవంతం చేస్తారు.ఈసారి 40+ సేవా కార్యక్రమాలు గ్రామానికీ నిర్వహించబడుతున్నాయి.

TTA సేవాడేస్ లో కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను స్థానిక ప్రతినిధులు, వాలంటీర్లతో కలిసి విజయవంతం చేస్తారు. TTA సేవాడేస్ 2025 కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించబడతాయి.

ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెడ్డి, AC-చైర్ విజయపాల్ రెడ్డి, అమెరికా నుండి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

TTA 10వ వార్షికోత్సవం
2025 డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి.10 ఏళ్లుగా తెలంగాణతో మా బంధం మరింత బలపడుతోంది

డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్” – Say No To Drugs సందేశంతో సేవాడేస్ 2025లో భాగంగా

హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో జరుగుతున్న సేవాడేస్ 2025 కార్యక్రమాల భాగంగా, డిసెంబర్ 14న గచ్చిబౌలిలో 10K రన్ నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంచటం మరియు మాదకద్రవ్యాల ప్రమాదాలను స్పష్టంగా తెలియజేయడం. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs”.

ఈ రన్‌లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ హబ్‌లో ప్రారంభమయ్యే ఈ రన్‌కు సంబంధించిన రూట్ మ్యాప్ మరియు టైమింగ్స్ త్వరలో ప్రకటించబడతాయి.

ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్ మెనెస్‌పై సమాజంలో బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యం. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది.