Mahaa Daily Exclusive

  బీసీలంతా ఏకమై టీ ఆర్ పి అభ్యర్థిని గెలిపించాలి..

Share

బీసీలంతా ఏకమై టీ ఆర్ పి అభ్యర్థిని గెలిపించాలి..

👉 తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న …

ఆలేరు (డిసెంబర్ 8 మహా పత్రిక)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరు నవీన్ కు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమారం నాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ గొలనుకొండ రూపు రేఖలు మారాలి అంటే బీసీలంతా ఏకమై నవీన్ కు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని మాట తప్పిందని విమర్శించారు.రాష్ట్రంలో రెడ్ల అరాచకాలు పెరిగిపోయాయని బీసీలు మరింత చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.ఇక తెలంగాణలో బీసీలకు ఏ రాజకీయ పార్టీ న్యాయం చేయదని హితవు పలికారు.అగ్రవర్ణాల పెత్తనాన్ని అణచివేసి బీసీ రాజ్యాధికారం సాధించుకోవడం తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. గతంలో కన్నా ప్రస్తుతం బీసీ వర్గాల్లో భారీ చైతన్యం వచ్చిందని ఈ చైతన్యం రాజకీయ ఐక్యత దిశగా మారాల్సిన అవసరముందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య,రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీన్ రాజ్,తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Latest