Mahaa Daily Exclusive

  ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Share

 

తుర్కపల్లి (డిసెంబర్ 8 మహా పత్రిక)

గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల
అధికారి, కలెక్టర్ హనుమంత రావు అన్నారు.
సోమవారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలు జరిగే తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు
ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామగ్రి ని బూత్ ల వారీగా సెపరేట్ గా చేసి సిద్ధం ఉంచాలన్నారు.ఓటర్ల జాబితా వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ పెట్టె లను క్షుణంగా పరిశీలించారు.బ్యాలెట్ పత్రాలు కూడా జాగ్రత చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు.స్వస్తిక్ మార్క్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ బాక్స్ లు అన్ని ఒకసారి ఓపెన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలని. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్ చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్ల ను చక్కబెట్టుకోవాలన్నారు.డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Latest