- మంచిర్యాల జిల్లాలో ఘనంగా విజయ్ దివాస్
మందమర్రి, మహా : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో డిసెంబర్ 9 మరువలేనిదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. మంగళవారం మందమర్రి సింగరేణి పాఠశాల ముందర గారు అంబేద్కర్ స్థూపం వద్ద విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 9 న వెలువడిందని అన్నారు. దానిని స్మరిస్తూ డిసెంబర్ 9 నాడు రాష్ట్రవ్యాప్తంగా “విజయ్ దివస్ ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట దిగుబడి కల్పనకు ప్రాజెక్టులు నిర్మించినట్లు చెప్పారు. పేద రైతులకు ప్రతి పంటకు రైతుబంధు పేరిట ఆర్థిక సహాయం అందించిన ఘాత కేసిఆర్ దేనని కొనియాడారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచి ఆ కుటుంబాలను ఆదుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేరిట ఏ రాష్ట్రంలో లేని విధంగా లక్ష రూపాయల పైచిలుకు ఆర్థిక సాయం బీఆర్ఎస్ గణతేనని చెప్పారు. అంతకుముందు టీబీజీకేఎస్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ స్థూపానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల శ్రీనివాస్, వేల్పుల రవి, ఎండి అబ్బాస్, డాక్టర్ రాజా రమేష్ బాబు, ఓ రాజశేఖర్, నిరోష, మద్ది శంకర్, రేఖ, బర్ల సదానందం, మేడిపల్లి సంపత్, దాసరి రాజనర్సు, బోరిగం వెంకటేష్, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, వెంకన్న, లింగన్న, ఎండి మాజర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.






