Mahaa Daily Exclusive

  బాలయ్యకు భారీ షాక్…

Share

  • బాలయ్యకు భారీ షాక్
  • అఖండ2 టికెట్ల పెంపు సర్క్యులర్​ను రద్దు చేసిన హైకోర్టు
  • లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు
  • విచారణ నేటికి వాయిదా

 

హైదరాబాద, మహా : సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన నటించిన అఖండ-2 టికెట్​ రేట్లు పెంచుతూ ఇచ్చిన సర్క్యులర్​​ను హైకోర్టు గురువారం రద్దు చేసింది. ప్రీమియర్​ షో సహా టికెట్​ ధరల పెంపు సర్క్యులర్​ను హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో హోంశాఖ, 14 రీల్స్​ ప్లస్​కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎఫ్​టీడీడీ కార్పొరేషన్​కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అఖండ 2 టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్​రెడ్డి పిటిషన్​ను వేశారు. ఈ లంచ్​ మోషన్​ పిటిషన్​కు అనుమతించి న్యాయస్థానం విచారణ చేపట్టింది. టికెట్ల ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేపట్టింది. జస్టిస్​ ఎన్​.వి. శ్రవణ్​కుమార్​ ఈ లంచ్​ మోషన్​ పిటిషన్​పై విచారణ చేపట్టారు. ఇలాంటి మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని హోంశాఖ జీపీని ప్రశ్నించింది. ఇప్పటికే టికెట్​ ధరల విషయంలో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది కదా అని ప్రశ్నించింది. టికెట్​ ధరలు పెంచుతూ మెమోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కాదా అని అడిగింది.

 

టికెట్​ ధరల విషయంలో ఏం జరుగుతుందని హోంశాఖ జీపీని హైకోర్టు నిలదీసింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని జీపిని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. ప్రతి సినిమాకు ఇదే విధంగా ధరలు పెంచుకుంటూ సర్క్యులర్​​ జారీ చేస్తున్నారని ఆగ్రహించింది. హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోంశాఖ స్పెషల్​ సీఎస్​గా కొత్త వ్యక్తి వచ్చారని కోర్టు ఆదేశాలపై పూర్తి అవగాహన లేదని జీపీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు అఖండ2 కోసం ఇచ్చిన సర్కులర్​ను రద్దు చేసింది. ప్రీమియర్​ షోతో పాటు టికెట్​ ధరలను పెంచుతూ జారీ చేసిన జీవోను రద్దు చేసింది. ఈ క్రమంలో హోంశాఖ, 14 రీల్స్​ ప్లస్​, ఫిలిం టెలివిజన్​ థియేటర్​ డెవలప్​మెంట్​ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

 

అఖండ 2 చిత్రం ప్రీమియర్​ షోకు అనుమతిస్తూ బుధవారం హోంశాఖ సర్క్యులర్​​ను జారీ చేసింది. గురువారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్​ షోకు రూ.600 టికెట్​ ధరను నిర్ణయించింది. శుక్రవారం నుంచి సింగిల్​ స్క్రీన్​కు రూ.50, మల్టీప్లెక్స్​ థియేటర్లకు రూ.100 అదనంగా పెంచుకునేలా సర్క్యులర్​​ను జారీ చేసింది. ఈ టికెట్ల రేట్లు 12, 13, 14 తేదీల్లో పెంచుకునేలా సర్క్యులర్​​ను హోంశాఖ ఇచ్చింది.

Latest