Mahaa Daily Exclusive

  మంత్రి కొండా సురేఖపై ఎన్ బీడబ్ల్యూ జారీ చేసిన నాంపల్లి కోర్టు…

Share

  • కేసు విచారణకు గైర్హాజరు
  • మంత్రి కొండా సురేఖపై ఎన్ బీడబ్ల్యూ జారీ చేసిన నాంపల్లి కోర్టు
  • ఫిబ్రవరి 5 న వ్యక్తిగత హాజరవాలని ఆదేశించిన కోర్టు

హైదరాబాద్, మహా : కేసు విచారణకు గైర్హాజరవడంతో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్ బీడబ్ల్యూ)ను జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ ఖేసు విచారణకు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత హాజరు కావాల్సి ఉంది. అయితే కేసు విచారణకు హాజరు కాకపోవడంతో ఎన్ బీడబ్ల్యూ జారీ చేసిన కోర్టు కేసు విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసిన కోర్టు ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.

గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇవి వివాదాస్పదమైనాయి. దీనిపై కేటీఆర్ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ.. తన పరువుకు నష్టం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సాక్షులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజ్ శ్రవణ్ స్టేట్‌మెంట్లను సైతం కోర్టు రికార్డు చేసింది. కోర్టులో ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.

Latest