గజ్వేల్, మహా :
తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వేళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ పార్టీ ముఖ్య నేతలతో గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‍లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. సర్పంచ్ తొలి దశ ఎన్నికల వేళ కేసీఆర్ ఈ భేటీ నిర్వహించడం ఆసక్తిగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపు 25శాతం స్థానాలు సాధించగా, పల్లెల్లో పట్టు సడలకుండా చూసుకోవాలని.. స్థానిక నేతలతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. మరెవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ విషయంలో కేంద్ర జలవనరుల సంఘం తీరుపై, ఏపీ తాజాగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖ రాయాలనుకోవడంపై చర్చించినట్లు తెలిసింది.






