- సారొస్తున్నారు….
- 19 న బీఆర్ఎస్ ఎల్ పీ, పార్టీ కార్యవర్గ సంయుక్త సమావేశం
- తర్వాత ప్రజా క్షేత్రంలోకి కేసీఆర్
- సాగునీరు, ప్రాజెక్టులే ప్రధాన ఏజండాగా ఉద్యమం
- కాంగ్రెస్, బీజేపీలపై సమరశంఖం పూరించనున్న గులాబీ నేత
హైదరాబాద్, మహా : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఆయన బయటికి రావాలన్న నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో ఈ నెల 19న బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే సమావేశంలో పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి తదితర అంశాలపై చర్చించనున్నారు. నీళ్ళు, నిధులు, నియామకలే ప్రధాన ఎజండాగా ఉద్యమం సాగించిన కేసీఆర్ తన హయాంలో నీటి వినియోగంపై కొంత మేర శ్రద్ధ పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో
సాగునీటి హక్కుల కోసం తెలంగాణలో మరోసారి ప్రజా ఉద్యమం తప్పదని భావిస్తున్న కేసీఆర్ పార్టీ కార్యకర్తలతో చర్చించి ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ఇప్పుడు 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు మోకరిల్లిందని కేసీఆర్ పార్టీ నేతల వద్ద ఫైర్ అయినట్లు సమాచారం. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఒక్కరు కూడా దీనిగురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాగునీటి విషయంలో బీజేపీ విధానాన్ని ఎదుర్కోవాలంటే మరోసారి పోరాటలే శరణ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చిఉండే ఈసమయానికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటి గురించి మరింత లోతుగా చర్చించేందుకు డిసెంబర్ 19న కేసీఆర్ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. పై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరపనున్నారు. సమావేశ అనంతరం భవిష్యత్ కార్యచరణను ప్రకటించి కదనరంగంలోకి దిగనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.








