Mahaa Daily Exclusive

  బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బీహార్ మంత్రి..

Share

  • బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బీహార్ మంత్రి
  • నితిన్‌ నబీన్‌ ను నియమించిన పార్లమెంటరీ బోర్డు
  • కలిసివచ్చిన క్రమశిక్షణ, మేనేజ్ మెంట్ స్కిల్స్
  • అయిదు సార్లు ఎమ్మెల్యేగా విజయం

దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రదాన్ ను నియమించాలన్న నిర్ణయానికి వచ్చిన నాయకత్వం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి నితిన్‌ నబీన్‌కు కట్టబెట్టింది. నితిన్ నబిన్ ప్రస్తుతం నితిష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు. పార్టీలో సీనియర్‌ నాయకుడైన నితిన్ ఏకంగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకున్న క్రమశిక్షణ, మేనేజ్‌మెంట్ స్కిల్స్, నాయకత్వం లాంటి లక్షణాల ఆధారంగా పార్టీ ఆయనకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టింది.

బీజేపీలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది అత్యంత కీలకమైనది. జాతీయ అధ్యక్షుడికి చేదోడు వాదోడుగా ఉండటంతో పాటు దేశవ్యాప్తంగా జరిగే పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించడం, అలాగే ఎన్నికలు జరిగినప్పుడు వ్యూహాలు అమలు చేయడం లాంటి బాధ్యతలు వర్కింగ్ ప్రెసెడెంట్ తీసుకుంటారు. అయితే బీహార్ నుంచి జాతీయ స్థాయిలో ఇంతపెద్ద పదవి రావడం అనేది చాలా అరుదు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నియామకం జరిగినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నితిన్ నబిన్‌కు బీహార్‌లో బలమైన సపోర్టు ఉంది. ఆయకున్న అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆయకు ఈ కీలకమైన బాధ్యతను అప్పగించింది. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగైన నేతగా నితిన్ గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే పార్టీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. త్వరలోనే మరోసారి భేటీ కానున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు నూతన అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

నితిన్ నబిన్ నేపథ్యం ఇదీ….

ప్రస్తుతం బీహార్ బీజేపీలో సీనియర్ నేతగా నితిన్ నబిన్ ఉన్నారు. పాట్నాలో జన్మించిన ఈయన సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. తండ్రి మరణాంతరం నితిన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. పాట్నాలోని బాంకిపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006 ఉప ఎన్నికలో విజయం సాధించినప్పటి నుండి, నవీన్ 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో బాంకిపూర్‌ నుంచి 51,000 ఓట్ల మెజారిటీతో అయిదవ సారి భారీ విజయం సాధించారు. నితిశ్ కుమార్ మంత్రివర్గంలో రహదారులు, నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Latest