- గెలిచింది.. హామీని నెరవేర్చింది..
- కోతుల బాధలు తీర్చిన కొత్త సర్పంచ్..
- కందికట్కూర్ కొత్త సర్పంచ్ విజయమ్మ రికార్డు..
- గెలిచిన తెల్లవారే మాట నిలబెట్టుకున్న సర్పంచ్గా రికార్డు..
- గ్రామస్తుల జేజేలు..
కరీంనగర్ మహా : ఎన్నికల్లో ఓట్ల వేటలో నేతలు హామీలు మాములే. కొందరు వాటిని నెరవేరుస్తుంటారు. మరి కొందరు మర్చిపోతుంటారు.. ఏళ్లకేండ్లు గడిచిన హామీల ఊసేత్తారు. ప్రజలకు నిత్యం ఏదో చెబుతూ బుకాయిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ వినూత్న పంథాలో సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కోతుల బాధను పూర్తిగా తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు అండగా నిలిచారు ఆశీర్వదించారు. ఈనెల 14వ తేదీన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైంది. తన ప్రజలకు ఇచ్చిన తన హామీని నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో తెల్లవారే కార్యరంగంలోకి దూకారు. కోతుల బాధను తీర్చేందుకు కోతులపట్టే వారిని ప్రత్యేకంగా రప్పించారు. వారు ఆ ఊర్లో ఉన్నకోతులను వారు పట్టుకెళ్ళి అడవిలో వదిలిపెట్టారు. గెలిచిన తెల్లవారే ఆ హామీని నిలబెట్టుకొని రికార్డు సృష్టించింది. సర్పంచ్ పనితీరుపై గ్రామస్తుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామం. సర్పంచ్ పేరు చింతలపల్లి విజయమ్మ.
ప్రతి ఊరిలో కోతులతో పెద్ద సమస్య. ఇన్నీరోజులు గుట్టలు.. ఇతర ప్రాంతాల్లో సంచరించే కోతులు ప్రస్తుతం గ్రామాలు, ఇండ్లలోకే వస్తున్నాయి. గుట్టలు గ్రానైట్ దెబ్బకు కరిగిపోవడంతో కోతులు గ్రామాల బాట పడుతున్నాయి. ఊర్లలో వీటి బెడత తీవ్రమైంది. ఇండ్లలోకి చొచ్చుకెళ్లి వస్తువులను ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు వణికిపోతున్నారు. అనేక మంది వాటి చేతిలో గాయపడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే చేతిలో కర్ర లేకుండా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలంతా కోతులను చూస్తే వణికిపోతున్నారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోతుల సమస్యే ప్రధాన అజెండాగా మారింది. ఎంత అంటే ఆ సమస్యను తీర్చిన వారికే ఓట్లు వేస్తామనే స్థాయికి వెళ్లింది. గ్రామస్తులు అదే నిర్ణయానికి వచ్చారు. కోతుల బాధలు తీర్చిన వారికే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపిస్తే కోతుల సమస్య మొదట తీరుస్తానని చింతలపల్లి విజయమ్మ మాట ఇచ్చింది గ్రామస్తులకు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో విజయమ్మకు గ్రామస్తులు అండగా నిలిచారు. నమ్మకంతొ గెలిపించారు. విజయమ్మ 389 ఓట్ల మెజార్టీతో కందికట్కూర్ గ్రామ సర్పంచ్గా విజయం సాధించారు. ప్రజలకు ఇచ్చిన ఆ హామీని నాన్చకుండా గెలిచిన తెల్లారే కోతుల బెడదను తీర్చారుజ సోమవారం ఆమె తన వాగ్దానాన్ని అమలు చేసి చూపించారు. కోతులను పట్టేవారిని చిత్తూరు నుంచి రప్పించారు. వారు 113 కోతులను సురక్షితంగా పట్టుకుని బోనుల్లో బంధించారు. వాటిని దూరంగా ఉన్న ఒక అడవిలో వదిలిపెట్టారు. కోతుల బెడదను పరిష్కరిస్తానన్న తన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు గ్రామస్తులు సర్పంచ్ చింతలపల్లి విజయమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోతులతో రోజూ ఇబ్బందులు పడేవారమనీ, కొత్త సర్పంచ్ వల్ల కోతుల బెడద తప్పిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో నేతలు విజయం సాధించేందుకు అలవి కానీ హామీలు ఇస్తూ గాలికి వదిలేస్తారు. ఏళ్లు గడిచిన అతీగతి ఉండదు. వాటి ఊసే ఎత్తరు. ఆ సర్పంచ్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన తెల్లారే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చారు. ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోనే కొత్త చరిత్ర సృష్టించారు. హ్యాట్సప్ సర్పంచ్ విజయలక్ష్మి.. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు చేపడుతూ పేరు ప్రఖ్యాతులు సాధించాలని కోరుకుందాం..








