Mahaa Daily Exclusive

  ఆస్ట్రేలియా బీచ్​లో కాల్పులు

Share

  • ఆస్ట్రేలియా బీచ్​లో కాల్పులు
  • హైదరాబాద్​తో నిందితుడు సాజిద్ కు లింకులు

మహా : ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌ వద్ద కాల్పులు జరిపిన సాజిద్‌ అక్రమ్‌ వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్లు గుర్తించారు. సాజిద్‌ మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకామ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 1998లో ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఆస్ట్రేలియా వలస వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ యూరప్‌ సంతితికి చెందిన వెనెరా గ్రోస్సోను వివాహం చేసుకుని స్థిరపడినట్లు వివరించారు. సాజిద్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కాల్పుల్లో మరో నిందితుడిగా ఉన్న కుమారుడు నవీద్‌తోపాటు కుమార్తె సైతం ఆస్ట్రేలియాలోనే జన్మించినట్లు వెల్లడించారు. వారిద్దరికి ఆస్ట్రేలియన్‌ పౌరసత్వం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. సాజిద్‌కు హైదరాబాద్‌లోని తన బంధువులతో అంతంత మాత్రమే సంబంధాలు కొనసాగించినట్లు ఆస్ట్రేలియన్‌ అధికారులు గుర్తించారు. గత 27 ఏళ్లలో సాజిద్ ఆరుసార్లు హైదరాబాద్‌కు వచ్చాడని, చివరిసారిగా 2022లో వచ్చినట్లు చెప్పారు. తొలుత కుటుంబం ఆస్తిపరమైన అంశాల వల్ల హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రులను కలిసినట్లు పేర్కొన్నారు. తర్వాత భారత్‌కు వెళ్లకూడదని సాజిద్‌ నిర్ణయించికున్నట్లు తెలిపారు. తన తండ్రి మృతి చెందినా అతను హైదరాబాద్‌కు రాలేదని వివరించారు. సాజిద్‌కు ఉగ్రవాద భావజాలం ఉన్నట్లు తెలియదని అతని కుటుంబ సభ్యులు తెలిపినట్లు చెప్పారు.