Mahaa Daily Exclusive

  23 నుంచి బడులకు క్రిస్మస్ సెలవులు….

Share

* 23 నుంచి బడులకు క్రిస్మస్ సెలవులు
* షెడ్యూల్ విడుదల చేసిన సర్కారు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల షెడ్యూల్‌ను సర్కారు ఖరారు చేసింది. పండుగ నేపథ్యంలో బడులకు విరామం ఇస్తూ విద్యాశాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విరామ దినాలను పాఠశాలల స్వభావాన్ని బట్టి రెండు విభాగాలుగా విభజించారు. క్రైస్తవ మత సంబంధిత మిషనరీ పాఠశాలలకు ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఈ విద్యాసంస్థలు తిరిగి ఈ నెల 28వ తేదీన పునఃప్రారంభమవుతాయి. మిగిలిన సాధారణ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు విరామం ఉంటుంది. ఇవి తిరిగి ఈ నెల 27వ తేదీన యథావిధిగా నడుస్తాయి. పండుగ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని విద్యాసంస్థలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ సూచించింది.

Latest