కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని భల్లునగర్ తండా గ్రామానికి చెందిన రైతు గుగులోతు నంద్యా(54) అప్పుల బాధలతో శుక్రవారం పురుగుల మందు సేవించాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని అప్పులు తీర్చలేని స్థితిలో మనోవేదనకు గురై నంద్యా పురుగుల మందు సేవించారు.పోస్టుమార్టం అనంతరం ఆదివారం నంద్య మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసుకురానున్నారు.
Post Views: 48







