Mahaa Daily Exclusive

  చెప్పారంటే చేస్తారంతే! 48 గంటల్లోనే అక్రిడిటేషన్ జీవో. : మంత్రి పొంగులేటి మార్క్ స్పీడ్!

Share

హైదరాబాద్, మహా.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం విధివిధానాలను పది రోజుల్లోగా రూపొందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ మాటను మరింత వేగంగా అమలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ఖమ్మంలో ప్రకటించిన 48 గంటలు గడవక ముందే ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో విడుదల చేయించి తన పాలనా దక్షతను చాటుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రక్రియలు నెలల తరబడి సాగుతాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ, జర్నలిస్టుల సమస్యల తీవ్రతను గుర్తించిన మంత్రి, అధికారులను పరుగులు పెట్టించి మరీ ఈ ఉత్తర్వులను వెలువరించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ అంశంపై స్పష్టత రావడంతో రాష్ట్రవ్యాప్తంగా మీడియా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నూతన నిబంధనల ప్రకారం అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే గుర్తింపు కార్డులు అందనున్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు, ప్రయాణ రాయితీలు పొందేందుకు మార్గం సుగమమైంది. కేవలం హామీలకే పరిమితం కాకుండా, చెప్పిన సమయం కంటే ఎనిమిది రోజుల ముందే జీవోను తీసుకురావడం పొంగులేటి శ్రీనివాస రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. మీడియా రంగాన్ని ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా గౌరవిస్తూ, వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నిర్ణయంతో స్పష్టమైంది.
మంత్రి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై జర్నలిస్ట్ సంఘాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. నాయకుడంటే మాట ఇవ్వడమే కాదు, ఆ మాటను చేతల్లో చూపించి భరోసా కల్పించేవాడు అని జర్నలిస్ట్ ప్రతినిధులు కొనిాడుతున్నారు. క్షేత్రస్థాయి విలేకరుల కష్టాలను గుర్తించి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా అక్రిడిటేషన్ ప్రక్రియను సరళతరం చేయడం అభినందనీయమన్నారు. మాట తప్పని నైజంతో, వేగవంతమైన నిర్ణయాలతో పాలనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మంత్రి పొంగులేటి, ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరి విశ్వాసాన్ని చూరగొన్నారు.

Latest