Mahaa Daily Exclusive

  జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపం.. ముఖ్యమంత్రి ‘చెత్తశాఖ’ మంత్రిలా వ్యవహరిస్తున్నారు: కల్వకుంట్ల కవిత

Share

ప్రజా ఆరోగ్య సమస్యను పట్టించుకోని ప్రభుత్వం
* ముఖ్యమంత్రి పై ఘాటు వాఖ్యలు
•జనం బాటలో భాగంగా డంపింగ్ యార్డు సందర్శించిన కవిత
•జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత
ఆమనగల్లు, మహా:
జనవాసాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో చేపట్టిన జనం బాట ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చేరుకుంది.శనివారం రాత్రి కడ్తాల్ మండలం సాలర్ పూర్ లో బస చేసిన కవిత ఆదివారం పర్యటనలో భాగంగా ముందుగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం జాగృతి నాయకులతో కలిసి ఆమనగల్లు మున్సిపల్ కేంద్రంలో పర్యటించారు.కవితను గుర్రం గుట్ట కాలనీ మహిళలు మంగళహారతితో స్వాగతం పలికారు. మార్కెట్ యార్డు నుండి డంపింగ్ యార్డు వరకు నడుచుకుంటూ వెళ్తు మహిళలతో కలిసి సమస్యలను తెలుసుకున్నారు.6వ వార్డు గుర్రగుట్టం,కమల్ నగర్ ప్రాంతంలో ప్రజల ఇండ్ల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. అనంతర మీడియాతో మాట్లాడుతూ జనావాసాల్లో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసారని. ఇది సరైన పద్దతి కాదన్నారు.దీన్ని తీసేయాలని ఆరేళ్లుగా స్థానికులు నిరసనలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవలే ఒక బాలింత మరణించిందని స్థానికులు చెబుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ డంపింగ్ యార్డ్ సమస్యపై శ్రద్ధ పెట్టాలని, ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం రూ.కోటి 20 లక్షలు కూడా మంజూరు చేసినప్పటికీ అమలు జరగకపోవడం బాధాకరమన్నారు.. మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించి చెత్తశాఖ మంత్రి మీ ముఖ్యమంత్రే కనుక ఆయనను డిమాండ్ లేక కమాండ్ చేసి ఈ సమస్య పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు.మా యాత్ర ఫిబ్రవరిలో పూర్తి అవుతుందని, అప్పటివరకు ప్రభుత్వానికి సమయం ఇస్తామన్నారు. ఇక్కడ ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోయింది. పర్యావరణం మీద పట్టి లేకుండా రోజు ప్లాస్టిక్ చెత్తను కాల్చడం వల్ల విషవాయువులు వెలువడి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఏర్పడుతోందని హెచ్చరించారు. ఇక్కడి ఎమ్మెల్యే చదవుకున్న వారు, విజ్ఞులు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తారని భావిస్తున్నాం.ఆలోపు సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి మేము హైకోర్టుకు వెళ్లెనా సరే కవిత ఉద్యమిస్తామని కీలక ప్రకటన చేశారు

Latest