Mahaa Daily Exclusive

  అరెస్టులతో మాజీ సర్పంచుల గొంతు నొక్కలేరు: రాష్ట్ర సర్పంచుల సంఘం ధ్వజం

Share

  •  అరెస్టులతో మాజీ సర్పంచుల గొంతు మూయలేరు..
  • పెండింగు బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులా??
  • రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి

అమనగల్లు, మహా:

తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచుల బాధలు వర్ణనాతీతమని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. అరెస్టులతో మాజీ సర్పంచుల గొంతు మూయలేరు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest