Mahaa Daily Exclusive

  ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం:బండి సంజయ్ ప్రశంస

Share

  • ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం
  • బండి సంజయ్ ప్రశంస
  • దర్శకుడు బోయపాటితో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా చూసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్, మహా : ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అఖండ 2 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని చెప్పారు. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు నరేంద్రమోదీ ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టే కరోనా వంటి మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ ను కనుగొని ప్రపంచానికి అందించగలిగామని తెలిపారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2 తాండవం సినిమాను బండి సంజయ్ వీక్షించారు. అనంతరం బోయపాటితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, అఖండ 2 సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. సంచలనాలకు మారుపేరు బోయపాటి శ్రీను సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారన్నారు. పరమేశ్వరుడు ఆవహించడంతో ఈ సినిమా చేసినట్లున్నారన్నారు. కమర్షియల్ హంగులకు అద్బుతమైన సందేశాన్ని ఇస్తూ తీసిన సినిమా ఇది అని అన్నారు. సనాతన ధర్మం గురించి సినిమా చేయాలంటే చాలా ధైర్యముండాలి. ఈ దేశంపైన, సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నా తట్టుకుని నిలబడిదంటే… దానికి కారణం మనం నమ్ముకున్న సనాతన ధర్మమేనని అన్నారు. ఆ నిరంతర చరిత్రను అద్బుతంగా సినిమా అఖండ తాండవం అని ప్రశంసించారు.

దేశ సరిహద్దులను సైనికులు రక్షిస్తే, ధర్మాన్ని సమాజం రక్షించుకోవాలన్నారు. అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా తప్పేనని, అన్యాయాన్ని ఎదురించి సమాజాన్ని రక్షించేవాడే గొప్ప. అని అన్నారు. సనాతన ధర్మం గొప్పతనం వినడం కంటే అఖండ తాండవం సినిమా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై, భారతీయుడిపై ఉందని చెప్పారు. మిగిలిన ఈ జీవితాన్ని ధర్మం, దేశం కోసం అర్పించాలనే సినిమా అఖండ.
భారత్ ఎప్పటికీ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశమని, కోవిడ్ తరుణంలో ప్రపంచమంతా దిక్కులు చూస్తుంటే…. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో కోవిడ్ వస్తే.. ఏ విధంగా ఎదుర్కొన్నారో, ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ద్రుశ్యాలను మనం కళ్లారా చూశాం. అంతటి యోధుడు నరేంద్రుడు భారత్ ను పాలిస్తున్నాడు కాబట్టే వ్యాక్సిన్ ను అందించగలిగామన్నారు.

సైంటిస్టులను ప్రోత్సహించామని, కరోనా వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ హైదరాబాద్ లో ఉందన్నారు. మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ ను పరీక్షించారని సంజయ్ గుర్తు చేశారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలక్రిష్ణ అద్బుతంగా నటించారన్నారు. బాలయ్య సినిమాల కోసం విద్యార్థులు, కాలేజీలు, యువకులు బెట్టింగులు పెట్టి మరీ వెళుతున్నారు. ఎన్టీఆర్ రూపంలో బాలయ్యను చూస్తున్నాం. అఖండ సినిమాలో బాలయ్యను చూస్తే శివుడే మన ముందు కన్పించినట్లుంది. అఖండ సినిమాను లీనమై చూశాం. ఎక్కడా రాజీపడకుండా అఖండ 2 సినిమా చూసిన బోయపాటి శ్రీనుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సినిమాను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడేలా మరిన్ని సినిమాలు రావాలి. ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్న దాడులను, పరిస్థితులను ఆసరాగా చేసుకుని సినిమాలు తీసి ప్రజలను మేల్కోల్పాల్సిన అవసరం ఉంది. కొంత మంది ధర్మం విషయంలో దారి తప్పుతున్నారు. దేవుడు లేడు, హిందూ సనాతన ధర్మం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ అఖండ 2 సినిమా గుణపాఠం. అటు ఇటు దారి తప్పిన వాళ్లంతా హిందూ ధర్మమనే గొడుగు కిందకు రావాలని కోరుతున్నానన్నారు.

Latest