Mahaa Daily Exclusive

  రేవంత్ సంకల్పం.. మేడారం పునర్వైభవం: శిలపై చెరగని తల్లుల చరిత్ర!

Share

  • మేడారం మెరిసేలా
  • పునర్నిర్మాణంతో పునరుజ్జీవం
  • స్వర్ణకాంతులు..కొత్త సొగబులు..
  • ధగ ధగ మెరుస్తున్న మేడారం..
  • పులకించిపోతున్న భక్తజనం..
  • ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పట్టుదలతో ఆలయానికి వైభవం
  • వందల ఏళ్లు చెక్కుచెదరకుండా అభివృద్ధి పనులు
  • భావి తరాలకు తెలిసేలా శిలలపై తల్లుల చరిత్ర

(మహా ప్రత్యేకం)

ఎట్లున్న మేడారం ఎట్ల మారింది. మొత్తం రూపురేఖలే మారిపోయాయి. నాటి మేడారానికి నేటి మేడారానికి ఎంతో తేడా కనిపిస్తోంది. భక్తులు మెచ్చేలా.. మురిసేలా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాలతో జాతర నిర్వహణకు అవసరమైన అభివృద్ధి పనులు భారీ స్థాయిలో చేపట్టారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం. రెండేళ్ళకోసారి జరిగే ఈ జాతరకు లక్షలాది మంది తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవార్లకు ఘనమైన పూజలు చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే జాతర ఈ సారి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చేపట్టింది. ఇందుకు రూ. 251 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో గద్దెల విస్తరణకే రూ. 101 కోట్లు వెచ్చిస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి మహా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేడారం ధగ ధగ మెరుస్తోంది. ఏర్పాట్లు, అభివృద్ధి పనులను చూసి భక్తులు మురిసిపోతున్నారు. కొత్త సొగబులు.. కొత్త కాంతులు వారిని కట్టిపడేస్తున్నాయి. గత పాలకులు ప్రతి సారి జాతర వచ్చిందంటే కోట్లాది రూపాయలు వెచ్చించి తాత్కాలికంగా అభివృద్ధి పనులు, వసతులు కల్పించేవారు. ప్రతీ సారి ఇదే జరుగుతుండేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రణాళిక విజన్​తో సీఎం రేవంత్​ రెడ్డి మేడారం దశదిశను మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా మేడారంలో ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. దాదాపు ఈ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం పనులు చేపట్టింది. జనవరి ఐదో తేదీ నాటికి పనులన్నీ పూర్తి చేసేందుకు రాత్రింభవళ్లు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. 2026 జనవరి 28-31 తేదీల మధ్య సమ్మక్క-సారలమ్మ జాతర పెద్ద ఎత్తున జరగనుంది. గద్దెల విస్తరణ, ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రానైట్‌ రాతి ప్రాకార నిర్మాణం, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు తుది దశలో వేగంగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ నిర్మిస్తున్న 32 గ్రానైట్‌ ఫిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను చిత్రీకరించారు. మార్బుల్‌ శిలలతో గద్దెలూ జంపన్నవాగు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థలు, ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌, 60 అడుగుల నుంచి నాలుగు లైన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్‌ టవర్లు, గ్రీనరీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జనవరి మొదటి వారం నుంచి భక్తులు పుణ్య స్నానాలు చేయడానికి వీలుగా జంపన్న వాగులో నీటి ప్రవాహం సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జాతర సజావుగా సాగేందుకు మహా కుంభమేళాలో భాగస్వాములైన నిపుణుల బృందం మేడారానికి చేరుకుని.. జాతర జరిగే ప్రాంతం, అక్కడికి దారి తీసే మార్గాలు, జాతర రద్దీ ఉండే ఉప ఆలయాలను సందర్శించి.. అధికారులకు తగిన సూచనలు..సలహాలు చేసింది. ఈసారి జాతరకొచ్చే భక్తులకు పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా గద్దెల సమీపంలోనే ఏకకాలంలో వేల వాహనాల పార్కింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి జాతర జరిగే 4 రోజులూ డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణ కానున్నది. డ్రోన్‌షో ఎక్కడ నిర్వహించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటారు. జాతరపై సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు డాక్యుమెంటరీ కూడా రూపొందిస్తున్నారు. జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 5 వరకు పనులన్నీ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.

అభివృద్ధి పనుల జాతర..

మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం రూ. 251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. గద్దెల విస్తరణకే రూ. 101 కోట్లు కేటాయించింది. 4,000 టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులు చేపట్టారు.750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000కి పైగా శిల్పాలు, 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేశారు. 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం, 8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు. 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల పవిత్ర వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. 140 రకాల ఆయుర్వేద మొక్కల నాటనున్నారు. పూజారుల సంఘం ఆమోదంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి. 2026 జనవరి 28వ తేదీ బుధవారం సారలమ్మ రాకతో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. 29న గురువారం సమ్మక్క దేవత గద్దెకు రావడం, 30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకోవడం, 31వ తేదీ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది. మొత్తంగా చూస్తే గతంలో చూసిన మేడారానికి… ప్రస్తుతం చూడబోయే మేడారానికి చాలా తేడాలుండనున్నాయి. గద్దెల విస్తరణలో అత్యంత అద్భుతంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. జాతరలోపే నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని సర్కారు స్పష్టం చేసింది. ఆ దిశగానే కాంట్రాక్టర్లు కూడా పనులు నిర్వహిస్తున్నారు.

గిరిజన పూజరుల సూచనలను పరిగణనలోకి

పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో గిరిజన పూజారులు, పెద్దలతో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించారు. వారి సూచనలు, సలహాలను తీసుకున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని మేడారంలో అభివృద్ధి పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నిర్మాణ పనులు ఒక మైలు రాయిగా నిలిచిపోనున్నాయి. నిర్మాణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేపడుతున్నారు. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలుంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. శిలలపై ఆదివాసుల సంస్కృతికి పెద్దపీట వేశారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా చెక్కించారు. ఇందుకోసం తెలుపు రంగు రాళ్లను ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించి శిల్పులతో చెక్కించాక మేడారానికి తీసుకొచ్చారు.

భావి తరాలకు తెలిసేలా శిలలపై తల్లుల చరిత్ర

మేడారంలో కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సర్కారు పనులు చేపడుతూ.. సమ్మక్క సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కించారు. కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన శిల్పాలు, చిహ్నాలు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతో పాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క సారక్క వంశస్తులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే అవకాశం దక్కుతుంది. అందు కోసమే ప్రత్యేకంగా కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కించేందుకు ప్రాధాన్యమిచ్చారు. గద్దెల ముందు తెల్లని గ్రానైట్​ స్తంభాలతో ఏర్పాటు చేస్తున్న ప్రధాన ద్వారం, ఆయా శిలలపై సమ్మక్క సారక్క పూర్వీకులతో పాటు, కోయల జీవనశైలిని తెలిపేలా చెక్కిన ఏడు వేల బొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. 50 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఈ ప్రధాన ద్వా రానికి 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో రెండువైపులా రెండేసి నిలువు స్తంభాలు, వాటిపై 80 పీట్ల పొడవైన అడ్డు స్తంభం, దానిమీద 60 ఫీట్ల పొడువైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో 8 స్తంభాలు నిలుపుతున్నారు. వీటిపై సమ్మక్క సారక్కతో పాటు 3,4,5,6,7 గొట్టుగోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటి వైపు శిలలపై ఆదివాసీల జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలను గీశారు. వీటిని చెక్కేందుకు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దాదాపు 450 మంది కళాకారులు నెలల తరబడి రేయింబవళ్లు శ్రమించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తెప్పించిన భారీ గ్రానైట్​ రాళ్లను ఇందుకు వినియోగించారు. అనంతరం వాటిని భారీ ట్రక్కుల్లో 600 కిలోమీటర్ల దూరంలోని మేడారానికి తరలించారు. ఇంతటీ మహాద్భుతంగా మేడారం జాతర నిర్వహణకు ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టడం రికార్డే..

సీఎం రేవంత్​ రెడ్డి పట్టుదల

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ఆ సమయంలో ప్రజలు, ఆదివాసీలు మేడారంలో అభివృద్ధి పనులు , పునర్నిర్మాణ పనులు చేపట్టాలనీ, జాతరకు అన్ని హంగులు కల్పించాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే తప్పకుండా మేడారంలో పునర్నిర్మాణ పనులు చేసి తీరుతామని నాడు రేవంత్​ రెడ్డి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్​ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు మేడారం అభివృద్ధికి నడుం బిగించారు. ఇచ్చిన మాటను నేడు నిలుపుకుంటున్నారు. మేడారంలో వసతుల కల్పన.. పునర్నిర్మాణ పనులు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి రూ. 251 కోట్లు మంజూరు చేశారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిత్యం మేడారంలో జరిగే పనులపై సమీక్ష నిర్వహిస్తూ మంత్రులు, అధికారులకు సూచనలు చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. డిసెంబర్​ చివరిలోగా పనులు పూర్తి చేసేలా అధికార యంత్రాంగాన్ని పురమాయిస్తున్నారు. మేడారం జాతరను దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కనులపండువగా నిర్వహించేందుకు సీఎం రేవంత్​ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు.

నిత్యం మంత్రుల బృందం సమీక్ష..

మేడారం ఆలయంలో పునర్నిర్మాణ పనులు వేగవంతానికి మంత్రుల బృందం ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నది. వరంగల్​ ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ నిత్యం పనులను పరిశీలిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పనుల్లో పూర్తి నాణ్యత పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏది అవసరం పడిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల పురమాయిస్తూ పనులు వేగవంతానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రతి రోజు పనుల వేగవంతం పై అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పనులు తుది దశలో ఉన్నాయి. మంత్రుల బృందాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులకు ఆదేశాలిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. మంత్రుల బృందం ప్రతిరోజూ పనులను పర్యవేక్షిస్తుండడం వల్ల పనులు వేగవంతంగా

Latest