- రాష్ట్రంలో తగ్గిన నేరాలు
- పెరిగిన నమ్మక ద్రోహం కేసులు
- లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు
- లోక్ అదాలత్ ల ద్వారా 7 లక్షల కేసుల పరిష్కారం
- 14 వేల ఉద్యోగాలకు త్వరలోనే లైన్ క్లియర్
- వార్షిక నేర సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2025 వార్షిక నివేదికను డీజీపీ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలు కూడా శాంతి భద్రతలు కాపీ ఎలక్షన్స్ అన్ని నిష్పక్షపాతంగా జరిగేలా కాపాడామని డీజీపీ అన్నారు.
మవోయిస్టుల అరెస్టులు లేవు.. లొంగిపోయింది 509 మంది
ఈ ఏడాది 509 మంది నక్సల్స్ లొంగిపోయారని.. వారిలో 481 మంది ఛత్తీస్‌గఢ్, 21 మంది తెలంగాణ, ఒకరు మహారాష్ట్ర, ఒకరు ఏపీ కి చెందిన వారున్నారన్నారు. నాలుగు నేషనల్ లోక్ అదాలత్, 1 స్పెషల్ అదాలత్ నిర్వహించామని, 7 లక్షల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడించారు. మూడు అంతర్జాతీయ ఈవెంట్స్ సక్సస్ ఫుల్‌గా నిర్వహించుకున్నామని తెలిపారు. తెలంగాణలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. సీఐడీ చీఫ్, ఏసీబీ డీజీ చారు సిన్హా , తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా షికా గోయల్, ఎస్ఐబీ ఐజీ సుమతి ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగిందని, ఫీడ్ బ్యాక్ కోసం ఈ ఏడాది ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదటి స్థానంలో తెలంగాణ..
ట్రావెల్ సేఫ్ పేరుతో సీఐడీ నూతన యాప్ తీసుకొచ్చిందని, మహిళలు, జర్నీ చేసే వారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని సూచించారు. టూరిస్ట్ పోలీసులను ఈ ఏడాది లాంచ్ చేశామన్నారు. 80 మంది నియమించి.. టూరిస్ట్ ప్లేస్‌లో పోలీసులు ఎలా పని చేయాలనే దానిపై ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. డ్రగ్స్ కట్టడి కోసం ఈ ఏడాది ఈగల్ టీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారన్నారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.
తగ్గిన సైబర్ నేరాలు
దేశంలో 41 శాతం సైబర్ నేరాలు పెరిగితే, తెలంగాణలో 3 శాతం తగ్గాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని వివరించారు. ఈ ఏడాది 2.28 లక్షలు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4 కేసులో మరణ శిక్షలు ఖరారయ్యాయని.. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పండిందని తెలిపారు. ఫోక్సో కేసుల్లో 144 కేసుల్లో 154 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని.. అందులో ముగ్గురికి మరణ శిక్ష, 48 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాయని డీజీపీ పేర్కొన్నారు.
రూ.173 కోట్ల డ్రగ్స్ సీజ్..
రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు భారీగా పెరిగాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం డ్రగ్స్ కేసులు పెరిగినట్లు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న నిందితులను ఈగల్ టీమ్ పట్టుకొస్తోందన్నారు. ఈగల్ టీమ్ ఈ ఏడాది రూ.173 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిందని అన్నారు. నమ్మక ద్రోహం కేసులు తెలంగాణలో 23 శాతం పెరిగాయన్నారు. ఐపీసీ సెక్షన్ కింద కేసులు 7.83 % పెరిగాయని.. అలాగే మహిళలపై దాడులు కేసులు 2.90 % పెరిగాయని అన్నారు. 248 మంది మహిళల హత్యలకు గురైయ్యారని తెలిపారు. రేప్ కేసులు 13% తగ్గాయని, కిడ్నాప్‌లు 10% , వేధింపులు కేసులు 9% తగ్గాయని అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది 23% రికవరీ చేసిందని… రూ. 246 కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. 25,500 మంది బాధితులకు రూ.159 కోట్లు రీ ఫండ్ చేసినట్లు తెలిపారు.
ప్రైవేట్ సంస్థల్లో మహిళల భద్రతకు కమిటీలు
ప్రైవేటు సంస్థల్లో మహిళల కోసం కమిటీలు ఏర్పాటు చేశామని, పోష్ యాక్ట్‌ను తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయబోతున్నామని.. ఇందులో 18 నుంచి 35 ఏళ్ళు లోపు ఉన్న వారు హాజరువుతారని తెలిపారు. టీజీ ఆర్టీసీ డ్రైవర్లను ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా పరీక్ష నిర్వహించామన్నారు. నయీమ్ కేసు సీఐడీ విచారణలో ఉందన్నారు. నయీం కేసులలోని భూములను రిజిస్ట్రేషన్ చేయోద్దని కోర్టు ఆదేశించిందని డీజీపీ తెలిపారు. నయీమ్ కేసులో సీజ్ అయిన ల్యాండ్స్, చాలా మంది అమ్మాలని ప్రయత్నం చేశారని తెలిపారు. నయీమ్ లాండ్స్‌పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ ల్యాండ్ ఎవరూ కొనవద్దని, అమ్మవద్దని ఆదేశాలు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు
ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఐబొమ్మ రవి కేసుపైనా స్పందించిన డీజీపీ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉందన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు అని అన్నారు. కోర్టులోనే తేల్చుకుంటానని రవి చెప్పాడని అడుగగా తెల్చుకోని దానికేముందని డీజీపీ సమాధానం ఇచ్చారు. గత ఏడాది 2,34,158 కేసులు నమోదు అయితే 2025 సంవత్సరంలో 2.28,69 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బీఎన్ఎస్ కేసులు 2024 లో 1,69,477 నమోదు అయితే 2025లో 1,67,018 కేసులు నమోదు అయ్యాయని ఇవి గతేడాదితో పోలిస్తే 1.45 శాతం తగ్గినట్లు వెల్లడించారు.
పెరిగిన డ్రగ్స్ కేసులు
డ్రగ్స్ కేసులు భారీగా పెరిగాయని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం డ్రగ్స్ కేసులు పెరిగినట్లు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న నిందితులను ఈగల్ టీమ్ పట్టుకొస్తోందన్నారు. ఈగల్ టీమ్ ఈ ఏడాది రూ.173 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిందని అన్నారు. నమ్మక ద్రోహం కేసులు తెలంగాణలో 23 శాతం పెరిగాయన్నారు. ఐపీసీ సెక్షన్ కింద కేసులు 7.83 % పెరిగాయని.. అలాగే మహిళలపై దాడులు కేసులు 2.90 % పెరిగాయని అన్నారు. 248 మంది మహిళల హత్యలకు గురైయ్యారని తెలిపారు. రేప్ కేసులు 13% తగ్గిందని, కిడ్నాప్‌లు 10% , వేధింపులు కేసులు 9% తగ్గాయని అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది 23% రికవరీ చేసిందని… రూ. 246 కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. 25,500 మంది బాధితులకు రూ.159 కోట్లు రీ ఫండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.దేశంలో 41 శాతం సైబర్ నేరాలు పెరిగితే.. తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయన్నారు. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని వివరించారు. ఈ ఏడాది 2.28 లక్షలు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
స్పోర్ట్స్ ఈవెంట్లలో సత్తా
డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్లలో తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటారని డీజీపీ వెల్లడించారు. జార్ఖండ్ లో నిర్వహించిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీసులు 18 పతకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ లో తెలంగాణ పోలీసులు 10 పతకాలు సాధించారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
14 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాల ఖాళీలు భారీగానే ఉన్నాయని డీజీపీ తెలిపారు. దాదాపు 14 వేల పోస్టుల భర్తికి అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని, త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి అనుమతి రానుందని వెల్లడించారు. అనుమతి వచ్చిన వెంటనే రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
నేర సమీక్షలో డీజీపీ తెలిపిన అంశాలు క్లుప్తంగా….
రాష్ట్రంలో గతంలో కంటే నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయి.
2025లో 173 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం పట్టుబడ్డాయి.
సెల్ ఫోన్ చోరీలు భారీగా జరగ్గా.. అందుకు తగ్గట్టుగానే రికవరీల్లో తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ లో నిలిచింది. 2025లోనే ఏకంగా ఒక లక్షా 20 వేల సెల్ ఫోన్లను రికవరీ చేసి.. బాధితులకు అందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ 3 శాతం తగ్గింది. ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనం
2024 సంవత్సరంతో పోల్చుకుంటే.. 2025లో మొత్తం నేరాలు 2.3 శాతం తగ్గాయి.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 5.68 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఆయా ప్రమాదాల్లో మరణాలు 8 శాతం తగ్గాయి. ఫస్ట్ ఎయిడ్ అవగాహనతో మృతుల సంఖ్య తగ్గుదల అని డీజీపీ తెలిపారు.
రాష్ట్రంలో హత్యలు 8.76 శాతం తగ్గాయి
అత్యాచారాలు కూడా 13.45 శాతం తగ్గాయి
రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు 27 శాతం తగ్గితే.. ఇదే సమయంలో దొంగతనాలు 9.1 శాతం తగ్గాయి.
మరో షాకింగ్ ఏంటంటే.. దోపిడీలు, దొంగతనాలు తగ్గినా.. నమ్మకద్రోహం కేసులు ఏకంగా 23 శాతం పెరిగాయి.
రాష్ట్రంలో వరకట్నం కోసం మహిళల హత్యలు గణనీయంగా తగ్గాయి. వరకట్న వేధింపుల కేసులు కూడా 2 శాతం తగ్గాయి. షీ టీమ్‌లు అత్యంత యాక్టివ్‌గా చేయటం వల్ల ఇది సాధ్యమైందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గాయి.
ఫింగర్ ప్రింట్ నిపుణుల సాయంతో 642 కేసులు ఛేదించారు.
2024 ఏడాదితో పోల్చితే డ్రగ్స్ కేసులు 30 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిందితులను గల్ టీమ్ పట్టుకొస్తుంది. ఈ ఏడాది ఈగల్ టీమ్ ద్వారా 173 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు 7.83 శాతం పెరగ్గా.. మహిళలపై దాడుల కేసులు 2.90 శాతం పెరిగాయి.
2025లో.. 248 మంది మహిళలు హత్యకు గురవ్వగా.. రేప్ కేసులు 13 శాతం తగ్గాయి
కిడ్నాప్ కేసులు 10 తగ్గగా.. వేధింపుల కేసులు కూడా 9 శాతం తగ్గాయి
తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది23 శాతం రికవరీ చేయగా.. దీని విలువ రూ.246 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం 25 వేల 500 మంది బాధితులకు రూ.159 కోట్లు రీఫండ్ చేశారు.







