Mahaa Daily Exclusive

  బైక్ ఢీకొని వ్యక్తి మృతి…

Share

లక్షెట్టిపేట,మహా,డిసెంబర్ 30:లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గంపలపల్లి గ్రామానికి చెందిన రాందేని మల్లేష్ అనే 57 సంవత్సరాల వ్యక్తిని రాయల్ ఎన్ఫిల్డ్ బైకు ఢీకొనడంతో మృతి చెందినట్లు స్థానిక ఎస్సై గోపతి సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి…మృతుడు సోమవారం సాయంత్రం తన ఇంటి నుండి కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆంధ్ర బోర్ ఏరియాలోని మహేంద్ర షోరూం ఎదురుగా కరీంనగర్ చౌరస్తా నుండి ఊత్కూర్ వైపు వస్తున్న రాయల్ ఎన్ఫిల్డ్ బైక్ నడుపుతున్న యుగేందర్ అనే వ్యక్తి తన బైక్ ను అతివేగంగా,అజాగ్రత్తగా నడపడంతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లే రాందేని మల్లేష్ ను వెనక నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు,కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సోమవారం రాత్రి 9:30 గంటలకు చనిపోయాడని తెలిపారు.మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.భార్య రాందేని సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.