లక్షెట్టిపేట,మహా,డిసెంబర్ 30:లక్షెట్టిపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చి గేటు ముందు స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటోని బొలెరో ట్రాలీ ఢీకొనడంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయని స్థానిక ఎస్సై గోపతి సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి… లక్షెట్టిపేట పట్టణానికి చెందిన రామస్వామి అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో రోజు మాదిరిగా భగత్ సింగ్ నగర్ కు చెందిన 9 మంది విద్యార్థులను లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల పాఠశాల,బాలుర పాఠశాలకు తరలిస్తుండగా సిఎస్ఐ చర్చ్ గేటు ముందు లక్షెట్టిపేట వైపు నుంచి ఆంధ్ర బోర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న కెనాల్ లో పడిపోయింది.వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి గాయపడ్డ విద్యార్థులను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం కొంతమందికి ఎక్కువ గాయాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి వైద్యుల సూచన మేరకు పంపించడం జరిగిందని తెలిపారు.ఆటో డ్రైవర్ రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు







