Mahaa Daily Exclusive

  గురునానక్ విద్యార్థి ఆత్మహత్య… కళాశాల యాజమాన్యమే కారణమా..?

Share

  • గురునానక్ విద్యార్థి ఆత్మహత్య… కళాశాల యాజమాన్యమే కారణమా..?
  • ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం
  • యాజమాన్యం వేధింపులతో విద్యార్థి రాము ఆత్మహత్య..?
  • ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆందోళనలు
  • కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి గురునాకేక్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కాలేజ్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆముదాల రాము(20) కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగా.?…
గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో, కళాశాల యాజమాన్యం వేధింపుల వలన విద్యార్థి మృతి చెందాడని, తరంగ్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, శివ ఎబివిపి నాయకులు, ముత్యాల మహేందర్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో, కళాశాల ముందు ధర్నా చేశారు.. విద్యార్థులు ఆందోళన చేపట్టి కళాశాలలోని భవనాల అద్దాలు ధ్వంసం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఇబ్రహీంపట్నం సిఐ మహేందర్ రెడ్డి కళాశాల వద్దకు చేరుకొని, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు..

విద్యార్థులను పట్టించుకోని కళాశాల యాజమాన్యం….
గతంలో కూడా విద్యార్థులు కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు..
డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా గురునానక్ కళాశాల ఉంది తప్ప విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపణలు..
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని, లేని యెడల అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

Latest