- తెలుగునాట దూసుకుపోతున్న ఎఎన్ఎన్
- తక్కువ కాలంలో అత్యధిక వీక్షాకాదరణ
- క్యాలెండర్ ఆవిష్కరించిన ఎఎన్ఎన్ సీఈవో కంది రామచంద్రారెడ్డి
హైదరాబాద్, మహా
తెలుగునాట ఎఎన్ఎన్ ఛానల్ తక్కువ కాలంలో అత్యధిక వీక్షకాదరణతో దూసుకుపోతున్నదని, నిజమే బలంగా ఎఎన్ఎన్ ముందుకు వెళ్తున్నదని ఎఎన్ఎన్ సీఈవో కంది రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఎఎన్ఎన్ -మహా పత్రిక కార్యాలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తెలుగురాష్ట్రాల్లో 600మందికి పైగా క్షేత్రస్థాయి నెట్ వర్క్ ఉన్న అమ్మన్యూస్ నెట్ వర్క్ నాణ్యమైన వార్తాకథనాలతో ప్రజాదరణ పొందిందన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో అసోసియేట్ ఎడిటర్ గడ్డం క్రిష్ణమూర్తి, న్యూస్ కోఆర్డినేటర్ రాంప్రసాద్, డెస్క్ ఇన్ ఛార్జి అజయ్, ఎడిటర్స్ వింగ్ హెచ్ఓడి సురేందర్, గ్రాఫిక్స్ ఇన్ ఛార్జిలు భాగ్యరాజ్, మధు, మహాపత్రిక చీఫ్ డిజైనర్ షరీఫ్ , డిజిటల్ హెడ్ ఆదిగురు, కెమెరా డిపార్ట్ మెంట్ హెచ్ ఓడి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10








