Mahaa Daily Exclusive

  కొత్తగూడెం డిఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Share

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, మహా:
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ బీవీ రాజు ఆదేశాలు ఉపాధ్యక్షురాలు కళ్యాణి సూచన మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ, జనరల్ సెక్రెటరీ పిట్టల కమలమ్మ, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ బొల్లం అరుణమ్మ శుక్రవారం కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మండల ప్రెసిడెంట్ రజిని, జ్యోతి, యేసు మని, పావని తదితరులు పాల్గొన్నారు.