బెస్ట్ టీచర్ మంజుల
కారేపల్లి, మహా: కారేపల్లి మండలం బీక్యాతండా గ్రామానికి చెందిన మాలోతు మంజుల ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికైంది. శనివారం.. భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును మాలోతు మంజుల పొందింది. ఈ సందర్భంగా.. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందుకుంది. జిల్లావ్యాప్తంగా.. 12 మంది ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డులకు ఎంపిక కాగా, కామేపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో స్కూల్ అసిస్టెంట్ గా (సోషల్ ) విధులు నిర్వహిస్తున్న.. మాలోతు మంజుల ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు కు ఎంపిక కావడం పట్ల కామేపల్లి, కారేపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 67








