Mahaa Daily Exclusive

  ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారులు….

Share

ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారులు
* రూ.3.51 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం
* ఏసీబీ రైడ్స్ తో అటవీ శాఖలో కలకలం
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, మహా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఉన్న తెలంగాణ ఫారెస్ట్
డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్ఎసీ) కార్యాలయంలో పనిచేస్తున్న ఫారెస్ట్ అధికారులు ఏసీబీ ట్రాప్ లో చిక్కుకున్నారు.
ఈ శాఖలో విధులు నిర్వహిస్తున్న తాడి రాజేందర్ కుమార్, తాటి శ్రావణిలు
జామాయిల్ కర్ర కోత విషయంలో ఒక కాంట్రాక్టర్ ను లంచంను డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం కార్యాలయంలో కాంట్రాక్టర్ నుండి అధికారి రూ.3.51 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వంలోని బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఏసీబీ శాఖ దాడులతో అటవీ శాఖలో తీవ్ర కలకలం రేగింది. అంతేకాకుండా ఈ ఘటన భద్రాద్రి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.