Mahaa Daily Exclusive

  కీసరలో రక్తపు దందా: మూగజీవాల రక్తం సేకరిస్తున్న ముఠా అరెస్ట్!

Share

  • గొర్రెలు మేకల రక్తం సేకరిస్తున్న మూటను పట్టుకున్న కీసర పోలీసులు.
  • పోలీసుల అదుపులో నిందితులు.
  • నిందితులను విచారిస్తున్న పోలీసులు.

మేడ్చల్,మహా : నాగారం సత్యనారాయణ కాలనీలో రహస్యంగా మేకలు,గొర్రెల మూగజీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర పీఎస్ పరిధి సత్యనారాయణ కాలనీలో ఘటన చోటుచేసుకుంది.మటన్ షాప్‍లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ అరెస్ట్ చేశారు.180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం, ఈ రక్తంతో ప్లేట్ లెట్స్ తో పాటు కొన్ని వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారని ముఖ్య సమాచారం.అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుండి రక్తం సేకరించడం వల్ల అవి ఒక రోజు తర్వాత చనిపోతాయని ఇది చట్ట విరుద్ధమైన చర్యగా పలువురు చెబుతున్నారు.

Latest