హైదరాబాద్, మహా: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని చరికొండ గ్రామపంచాయతీ బోయినగుట్ట తండా వంకరరాయి అడవుల్లో జెలిటీన్ స్టిక్ పేలి జింక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందుల కోసం జిలిటిన్ స్టిక్కులు అమర్చారు. ప్రమాదవశాత్తు జింక దానిని తినబోయి పేలి చనిపోయి ఉంటుందని సమీప ప్రజలు అనుమానం వ్యక్త పరుస్తున్నారు.
గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం తెలుపడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తదుపరి మృత జింక ను కడ్తాల్ పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉసేన్ తెలిపారు.
Post Views: 21








