Mahaa Daily Exclusive

  రేవంత్ పిట్టకథలు.. ఉత్తమ్ కట్టుకథలు: అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోంది – హరీష్ రావు ధ్వజం

Share

  • ఉత్తమ్ కట్టుకథలు
  • రేవంత్ పిట్ట కథలు
  • అసెంబ్లీలో పీపీటీపై హరీష్ విమర్శలు

హైదరాబాద్,మహా: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కృష్ణా జలాల అంశంపై ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో పీపీటీ ఇచ్చిన హరీష్ రావు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారంటూ విమర్శించారు. రాజకీయాల కోసం తాము పీపీటీ ఇవ్వడం లేదన్నారు. ఫజల్ అలీ కమిషన్ చెప్పినా వినకుండా ఆంధ్రాలో కలిపి.. తెలంగాణకు ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ నాయకుల తీరును విమర్శించారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని హరీష్ విమర్శించారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్సే అని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు.

Latest