Mahaa Daily Exclusive

  బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించిన ఎంపీ డీకే అరుణ… పనుల పురోగతి పై సమీక్ష…..

Share

హైదరాబాద్, మహా: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఎయిమ్స్ బోర్డు మెంబర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత అగర్వాల్, ఎయిమ్స్ అకడమిక్ డీన్ నితిన్ అశోక్ జాన్, ఎయిమ్స్ మెడికల్ సూపరిండెంట్ మహేశ్వర్ లక్కిరెడ్డిలతో సమావేశం నిర్వహించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రసంటేషన్ ద్వారా బీబీనగర్ ఎయిమ్స్ లో జరుగుతున్న పనుల పురోగతి, అందిస్తున్న సేవలను బోర్డు సభ్యురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు వివరించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత అగర్వాల్. ఎయిమ్స్ లో అందిస్తున్న ఓపీ సేవలు, టెస్టుల పోగ్రెస్, పీజీ, యూజీ వైద్య విద్యార్థుల హాస్టల్ టవర్స్ నిర్మాణం,ఆడిటోరియం, వివిధ విభాగాల లాబ్స్, ఎమర్జెన్సీ బిల్డింగ్ ల పనులు ప్రణాళికబద్దంగా టైం డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

ఎయిమ్స్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని,ప్రస్తుతం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు మెరుగుపరచడంతో పాటు, పూర్తి స్థాయి వైద్య సేవలు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేస్తున్న కృషికి ఎయిమ్స్ బోర్డు మెంబర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఎయిమ్స్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తె ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందుతాయని,ఎయిమ్స్ లో అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో సేవలు, తక్కువ ఖర్చుతో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుతాయని అంతేకాక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం తో పాటు ఆరోగ్య శ్రీ సేవలు కూడా ఎయిమ్స్ లో అందుబాటులో ఉన్నాయని త్వరలోనే అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుతాయని ఎంపీ డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు.

సమావేశం అనంతరం ఎయిమ్స్ బోర్డు సభ్యులు ఎంపీ డీకే అరుణకు బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత అగర్వాల్ మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి, బీబీనగర్ ఎయిమ్స్ మెమెంటో బహుకరించారు.

Latest