హైదరాబాద్ సిటీ, మహా
హైదరాబాద్ నగరంలో పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు అష్రఫ్-ఉల్-మదారిస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, యాకుత్‌పురా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మీర్ చౌక్, హైదరాబాద్ లో
నిర్వహించారు. ఈ అవగాహన శిబిరాల్లో రోడ్ సురక్ష అభియాన్ – 2026 డ్రగ్స్ దుర్వినియోగ నివారణ, బాలికల రక్షణ అంశాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. ప్యానెల్ అడ్వకేట్ జగదాంబ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో యువత పాత్ర, డ్రగ్స్ వలన విద్యా-భవిష్యత్‌కు కలిగే నష్టం, బాలికలపై జరుగుతున్న నేరాల నుంచి రక్షణకు చట్టాలు కల్పించిన హక్కులు గురించి సరళమైన ఉదాహరణలతో వివరించారు. విద్యార్థులు మంచి అలవాట్లు అలవర్చుకొని, డ్రగ్ ఫ్రీ మరియు సేఫ్ సొసైటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ అజీజ్ అలీ ఖురేషీ , పారా లీగల్ వాలంటీర్ కె. రాజు ,
మీర్ చౌక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ లాల్ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలు, చట్టపరమైన అవగాహన, పోలీసు శాఖ సహకారం గురించి విద్యార్థులకు వివరించారు. ఇరు పాఠశాలలలోని హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని
ఈ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేశారు.








